Somi Reddy: ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు.. సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. కాకణి ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపెందుకు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కి పిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

New Update
Somi Reddy: ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు.. సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

TDP Somi Reddy: సర్వేపల్లి ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. కాకణి ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపెందుకు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరుల ద్వారా కాకణి కల్తీ మద్యం ఎరులై పారిస్తున్నారన్నారు. 6301 మద్యం బాటిళ్లు దొరికిన ఘటనలో వైసీపీ నేత సుధాకర్, డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారని అయితే, కాకణి కోసం వచ్చిన మధ్యానికి కాకణిని ముద్దాయిగా పెట్టాలని అన్నారు.

Also Read: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..!

గవర్నర్ పాలనలో గతంలో కూడా కల్తీ మద్యం కేసుల్లో నాలుగు ఛార్జి షీట్లో కాకణి ముద్దాయిగా ఉన్నాడన్నారు. 2014 ఎన్నికల్లో అనుచరుల ఇళ్లల్లో దొరికిన మధ్యానికి కేసు నమోదు చేసినప్పుడు.. ఇప్పుడు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. రాయల్ ప్యాలెస్ మద్యం బ్రాండ్ కాకణిదని.. అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేసి అసలు దోషి కాకణిని ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కి పిర్యాదు చేస్తున్నానన్నారు.

Also Read: జగన్ ది గులకరాయి డ్రామా.. బుగ్గనకు బైరెడ్డి శబరి సవాల్..!

ఎవరిని కలుస్తున్నామో తెలుసుకునేందుకు కాకణి తమ ఫోన్ల లొకేషన్ ను ట్యాప్ చేయిస్తున్నాడని ఆరోపించారు. కాకణి తొత్తులుగా పని చేసిన పోలీస్ అధికారులు శివకృష్ణ రెడ్ది, రామకృష్ణలు మా కదలికలపై లొకేషన్ ట్యాప్ చేస్తున్నాడన్నారు. ఎన్నికల డంపింగ్ మాస్టర్ గా కాకణికి బిరుదు వచ్చిందని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు