Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు. పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు. సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Also read : Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్ లల్లాకు సూర్య తిలకం
కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్ JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి