AP : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్‌ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌.!

I&PRలో జ‌రిగిన ప్రక‌ట‌న‌ల‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జ‌గ‌న్ ప్రభుత్వం రూ. 850 కోట్లు ప్రక‌ట‌న‌లకు ఖర్చు చేశారన్నారు. ఏబీసీ రిపోర్టుకు విరుద్దంగా వ్యవహరించారని, సాక్షి పత్రికకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారని ఆరోపించారు.

New Update
AP : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్‌ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌.!

TDP MLS's Demand A House Committee On I & PR Ads : ఐ అండ్ పీఆర్ (I&PR) లో జ‌రిగిన ప్ర‌క‌ట‌న‌ల‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యేలు న‌క్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావ‌ణ్ కుమార్, ధూళిపాళ న‌రేంద్ర‌ ఈ విషయంపై మాట్లాడారు. 2019 - 2024 మార్చి వ‌ర‌కు మాజీ సీఎం జగన్ (Ex. CM Jagan) రూ. 850 కోట్లు ప్ర‌క‌ట‌న‌లకు ఖర్చు చేశారన్నారు. ఏబీసీ రిపోర్టుకు విరుద్దంగా ఐ అండ్ పీఆర్ క‌మీష‌న‌ర్ వ్యవహరించి ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసిరన్నారు.

ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి నిబంధనలకు విరుద్ధంగా త‌మ‌కు కావాల్సిన ప‌త్రికకు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన క‌మీష‌న‌ర్ లబ్ధి కలిగించారన్నారు. మాజీ సీఎం జగన్‌ సోంత పత్రిక సాక్షి (Sakshi) కి పెద్ద ఎత్తున ప్రకటనల డబ్బు చెల్లించారని ఆరోపించారు. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట




Advertisment
Advertisment
తాజా కథనాలు