వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు..తేల్చి చెప్పిన నిమ్మల రామానాయుడు.! టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు సేకరణ పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. By Jyoshna Sappogula 16 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Nimmala Ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నాలుగున్నర ఏళ్ల కాలంలో టిడ్కో గృహాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు సేకరణ పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తాము కార్యక్రమం పెట్టుకున్న రోజే వైసిపి నాయకులు అదే ప్రాంతంలో కార్యక్రమం ఎలా పెడతారంటూ మండిపడ్డారు. నిరసనలు చేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. వైసీపీ అంటేనే దొంగల, దోపిడీల రాజ్యం అని దుయ్యబట్టారు. #టిడ్కో_గృహాలసముదాయంలో_తలపెట్టిన_వంటవార్పు నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసిన #వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన లబ్ధిదారులు, #టిడిపి #జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు. pic.twitter.com/Vv1vuDh5wb — Nimmala Ramanaidu (@RamanaiduTDP) November 16, 2023 కాగా, నిన్న పాలకొల్లు టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. టిడిపి, వైసిపి(TDP-YCP) నాయకులు ఒకే రోజు టిడ్కో గృహాల వద్ద నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. వైసిపి హయంలో టిడ్కో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ ‘పాలకొల్లు చూడు’ కార్యక్రమంకు పిలుపునిచ్చారు టిడిపి నేతలు. టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, టిడిపి హయాంలో టిడ్కోలో భారీ అవినీతి జరిగిందంటూ నిజం చెబుతాం అనే నిరసన కార్యక్రమంను చేపట్టారు వైసీపీ నేతలు. అయితే, ఈ కార్యక్రమంకు అనుమతి లేదంటూ పోలీసులు టిడిపి ఎమ్మెల్యే రామానాయుడును నిన్న అరెస్ట్ చేశారు. పేదలు మహిళల సొంత ఇంటి కల కోసం ఉద్యమించిన నన్ను బలవంతంగా పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు.. pic.twitter.com/SiIjEx8Cnw — Nimmala Ramanaidu (@RamanaiduTDP) November 15, 2023 Also read: అందుకే.. జగన్ వై నాట్ 175 అని అంటున్నారు: బోండా ఉమా #tdp-mla-nimmala-ramanaidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి