పాలకొల్లులో హై టెన్షన్..ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.! పాలకొల్లులో హై టెన్షన్ నెలకొంది. టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. పోటా పోటీ నిరసన కార్యక్రమం చేపట్టారు వైసీపీ టీడీపీ. దీంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు. By Jyoshna Sappogula 15 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి MLA Nimmala Ramanaidu: పాలకొల్లు టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. టిడిపి, వైసిపి(TDP-YCP) నాయకులు ఒకే రోజు టిడ్కో గృహాల వద్ద నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ రెండు కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పోలీసుల హెచ్చరికలు జరిచేశారు. అయితే, పోలీసుల హెచ్చరికను ఏ మాత్రం లెక్కచేయలేదు. టిడ్కో గృహాల వద్ద పోటా పోటీగా రెండు పార్టీల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. Also Read: జగన్ చేసిన ఘనకార్యాలు ఇవే..గంటా శ్రీనివాసరావు సంచలన పోస్ట్.! వైసిపి హయంలో టిడ్కో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ ‘పాలకొల్లు చూడు’ కార్యక్రమంకు పిలుపునిచ్చారు టిడిపి నేతలు. టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, టిడిపి హయాంలో టిడ్కోలో భారీ అవినీతి జరిగిందంటూ నిజం చెబుతాం అనే నిరసన కార్యక్రమంను చేపట్టారు వైసీపీ నేతలు. అప్రమత్తమైన పోలీసులు టిడిపి ఎమ్మెల్యే రామానాయుడును గృహ నిర్భందం చేశారు. అయితే, పోలీసుల కన్నుగప్పి ఎమ్మెల్యే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పెంకిళ్లపాడు వెళ్లే క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేదలు మహిళల సొంత ఇంటి కల కోసం ఉద్యమించిన నన్ను బలవంతంగా పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు.. pic.twitter.com/SiIjEx8Cnw — Nimmala Ramanaidu (@RamanaiduTDP) November 15, 2023 Also Read: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..దాదాపు 20 మంది మృతి.! ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు. పేదలు మహిళల సొంత ఇంటి కల కోసం ఉద్యమించిన నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో ఎక్కించారని ఎమ్మెల్యే నిమ్మల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. #tdp-mla-nimmala-ramanaidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి