TDP Leaders: సీఈసీకి లేఖ రాసిన టీడీపీ నేతలు

AP: సీఈసీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, దీపక్‌ రెడ్డి లేఖ రాశారు. తాడిపత్రి అల్లర్ల బాధితులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఆ అల్లర్లలో తాను లేకపోయినా కేసు నమోదు చేశారని దీపక్‌రెడ్డి పేర్కొన్నారు.

New Update
TDP Leaders: సీఈసీకి లేఖ రాసిన టీడీపీ నేతలు

TDP Leaders: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు లేఖ రాశారు. సీఈసీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, దీపక్‌ రెడ్డి లేఖ రాశారు. తాడిపత్రి అల్లర్ల బాధితులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఎవరి ఆదేశాలతో రాజంపేట డీఎస్పీ దాడులు చేశారో తెలియట్లేదన్న నేతలు.. ఆస్మిత్‌ రెడ్డి ఇంటిపై డీఎస్పీ చైతన్య దాడికి పాల్పడ్డారని అన్నారు. ఆస్మిత్‌ రెడ్డి సిబ్బంది, డ్రైవర్లు, పొరుగువారిని గాయపరిచారని.. తాడిపత్రి అల్లర్లలో తాను లేకపోయినా కేసు నమోదు చేశారని దీపక్‌రెడ్డి పేర్కొన్నారు. జూన్‌ 4న ఆస్మిత్‌ కౌంటింగ్‌కు దూరంగా ఉంచాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. హక్కులు రక్షించాలని సీఈసీని దేవినేని ఉమ, దీపక్‌ రెడ్డి కోరారు.

Advertisment
Advertisment
Advertisment