TDP-JSP: గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది.! "గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది" పేరుతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు టీడీపీ-జనసేన. ఏపీలో ఉన్న రోడ్ల దుస్థితిపై ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 18 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP-JSP: "గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది" పేరుతో ఎన్టీఆర్ జిల్లా గడ్డమనుగులో నిరసన కార్యక్రమం నిర్వహించారు టీడీపీ-జనసేన. ఏపీలో ఉన్న రోడ్ల దుస్థితిపై ఆందోళన చేపట్టారు. గడ్డమనుగు నుండి జి కొండూరు వరకు పాదయాత్ర కార్యక్రమాం నిర్వహించారు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడారు. టీడీపీ హయాంలో చంద్రబాబు కృషితోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రూ.5,694 కోట్లతో 23,553 కి.మీ. రోడ్లు వేసి గ్రామాలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దామని అన్నారు. రూ.12వేల కోట్ల బి.టి రహదారులకు పనులు చేపట్టి రూ.2,599 కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్డు వేశామని తెలిపారు. పట్టణాల్లో 2,772 కి.మీ. రహదారులు నిర్మించారని... రూ.7,525 కోట్లతో మరో 5,882 కి.మీ. రహదారులు వివిధ దశల్లో ఉన్నాయని వ్యాఖ్యనించారు. మరో 8 వేల సి.సి రోడ్లు నిర్మాణంలో ఉండగా జగన్ రెడ్డి వాటన్నింటిని రద్దు చేశాడని విమర్శించారు. రాజధాని అమరావతికి రాయలసీమను అనుసంధానించేలా 25వేల కోట్లతో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే ను టీడీపీ హయాంలోనే ప్రతిపాదిస్తే జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విజయవాడలో బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు టీడీపీ చేస్తే ప్రారంభోత్సవం జగన్ రెడ్డి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ 5 ఏళ్లల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల కోసం రూ.3,160.38 ఖర్చు చేశారని ప్రచురించిందని.. అదే వైసీపీ రూ.4,492.99 కోట్లు వ్యయం చేసిందని తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజలను మోసం చేసారని దుయ్యబట్టారు. Also Read: అతని వల్లే సంజయ్‌ను తొలగించారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. గత ఏడాది 2022 జూన్ 25న ఇదే రోడ్డులో గుంతలు పుడ్చమని జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించేలా దుగ్గిరాలపాడు నుండి కొండూరు వరకు పాదయాత్ర చేసామన్నారు. టిడిపి హయాంలో మంజూరైన పనులను క్యాన్సిల్ చేసి కొత్తగా శంకుస్థాపనల పేరిట ఎమ్మెల్యే సన్నాసి వసంత కృష్ణ ప్రసాద్ ఆర్భాటం చేశాడని కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఈ రోడ్డు దుస్థితి ఇలానే ఉంది .. ఇంత అసమర్ధ, చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి అవసరమా ? మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం రెడ్డిగూడెం రంగాపురం వద్ద గుంతల కారణంగా ఒక పెద్దాయన మరణించాడని అతడి మరణంతో కుటుంబం రోడ్డు పాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రోడ్డులో గుంతలు పూడ్చడానికి ఒక లారీ గ్రావెల్ తెచ్చి కార్యక్రమం చేస్తుంటే వసంత కృష్ణ ప్రసాద్ పోలీసులను పంపి కార్యక్రమం అపుతున్నారని ఆరోపించారు. మీకు చేతకాదు.. చేయలేరు.. మేము చేసి చూపిస్తే డ్రైవర్ను బెదిరించి కేసులు పెడతామంటున్నారు.. అన్నం తింటున్నారా ? గడ్డి తింటున్నారా ? అంటూ ధ్వజమెత్తారు. #jana-sena-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి