నందిగామలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాస.!

నందిగామలో టీడీపీ - జనసేన సమావేశం రసాభాస జరిగింది. టీడీపీ నాయకులు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు జనసేన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బోల్దిశెట్టి శ్రీకాంత్. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్టేజి పైకి వెళ్ళేందుకు నిరాకరించారు.

New Update
నందిగామలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాస.!

TDP-JSP: చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పోరాడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన నాయకులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టబోయే కార్యక్రమాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు .  అయితే, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ- జనసేన మొదటి సమావేశం లో స్వల్ప రసాభాస జరిగింది.

Also Read: జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ హౌస్ అరెస్ట్

తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు జనసేన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బోల్దిశెట్టి శ్రీకాంత్. మొదటి సమావేశం లోనే తమకు టీడీపీ నాయకులు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్టేజి పైకి వెళ్ళేందుకు నిరాకరించారు.అయితే, టీడీపీ నేతల బుజ్జగింపుతో మళ్లీ స్టేజి పైకి వెళ్ళారు. అనంతరం టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం సాఫీగా కొనసాగింది.

Also Read: జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ హౌస్ అరెస్ట్

కాగా, ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని రెండు పార్టీల నాయకులు కలిసి నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, నిరుద్యోగం, ఇంకా పలు సమస్యలపై కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు