AP POLITICS : జగన్ టార్గెట్ గా టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు ?త్వరలో ఢిల్లీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో నడుస్తున్న చర్చ. వీటికి బలం చేకూరుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తుల విషయంపై చర్చలు జరిపి క్లారిటీ తీసుకోనున్నారని తెలుస్తోంది. By Nedunuri Srinivas 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి TDP -JANASENA -BJP ALLIANCE: రానున్న ఎన్నికల్లో టిడిపి ,జనసేన ,బీజేపీ ఏకం కానున్నాయా ? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తుంటే. ఇప్పటికే టిడిపి ,జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు బీజేపీ తో సైతం పొత్తు పెట్టుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం,.ఇందులో భాగంగానే త్వరలోనే జనసేన అధినేత ఢిల్లీకి వెళ్లనున్నారు.పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారని, ఈ విషయంపై అధిష్టానంతో క్లారిటీ తీసుకోనున్నారని సమాచారం. ఇక.. పవన్ భేటీ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. టిడిపి - జనసేన కూటమితో బిజెపి కలిసి వస్తుందా? ఎన్నికల షెడ్యూల్స్ వచ్చే సమయం కూడా దగ్గర పడుతుండటంతో ఈలోగా బీజీపీ , టిడిపి, జనసేన పొత్తులపై క్లారిటీ రావాలని ఈ మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇక.. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ బీజీపీ అధ్యక్షురాలిగా చాలా యాక్టీవ్ గా ఉన్న పురంధరేశ్వరి సైతం టిడిపి , జనసీన పార్టీలతో చాలా సన్నిహితంగా ఉండటం మనం చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ , జనసేన పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలతో బీజీపీ కలుస్తుందా అనే సంశయం కూడా ఉంది. మరో వైపు ఏపీలో బిజెపి - జనసేన పొత్తు ఉందని,అంతర్గత చర్చలు జరుగుతున్నాయని,ఈ సఖ్యత కారణంగానే మొన్న జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జనసేన పొత్తులో పోటీ చేయడం జరిగిందని తెలిసిందే. అయితే ..టిడిపి - జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమయింది. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల! మరో వైపు.. వైస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రధసారధిగా ఉండటం.. షర్మిల చంద్రబాబు వదిలిన బాణం అంటూ నేతలు విమర్శలు గుప్పిస్తుండటం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చూస్తే .. కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే చంద్రబాబుతో బిజెపి ఎలా పొత్తు పెట్టుకుంటుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.చంద్రబాబు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణలో పోటీ చేయకుండా రేవంత్ గెలుపు కోసం పరోక్షంగా మద్దతు తెలిపారని కూడా మొన్న ఎన్నికల సమయంలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏదేమయినా ఇప్పడు అంతా పొత్తుల రాజ్యంలానే బయటకు కనిపిస్తున్నా .. నేతల లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్న చందంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. మరో వైపు ఏపీలో అధికార ఉన్న వైసీపీ ని గద్దె దింపడానికి అటు టీడీపీ,ఇటు కాంగ్రెస్,మరో వైపు జనసేన తో పాటు బిజెపి కూడా గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, జనసేన, టిడిపి కలిస్తే అధికారం చేతులు మారే అవకాశముందని నేతలు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి.. ఈ పొత్తుల కథ ఎంతవరకు వెళ్తుందో? ALSO READ: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ విచారణ? #andhra-pradesh-elections-tdp #tdp-janasena-allinace #ysrcp-vs-tdp-janasena #bjp-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి