TDP: లోక్‌సభలో 6వ అతిపెద్ద పార్టీగా టీడీపీ 18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా టీడీపీ ఆరో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ- 240, కాంగ్రెస్ - 99, సమాజ్‌వాదీ పార్టీ- 37, తృణమూల్ కాంగ్రెస్- 29, డీఎంకే - 22 టాప్ ఐదు స్థానాలలో ఉన్నాయి. 16 ఎంపీలతో టీడీపీ 6వ స్థానం.. నలుగురు ఎంపీలతో వైసీపీ 15వ స్థానంలో ఉంది. By V.J Reddy 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి TDP: మొత్తం 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా టీడీపీ ఆరో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తం సభలో బీజేపీ - 240, కాంగ్రెస్ - 99, సమాజ్‌వాదీ పార్టీ - 37, తృణమూల్ కాంగ్రెస్- 29, డీఎంకే - 22 టాప్ ఐదు స్థానాలలో ఉన్నాయి. టీడీపీ 16 మంది సభ్యులతో 6వ స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రమే మూడంకెల స్థానాలు దక్కాయి. 34 పార్టీలకు ఏక అంకె సీట్లే దక్కాయి. మరోవైపు 16 పార్టీలకు కేవలం ఒక్కో సీటు మాత్రమే వచ్చింది. 4 స్థానాలతో వైసీపీ 15వ స్థానంలో ఉంది. కాగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మెజారితో స్థానాల్లో గెలిచిన బీజేపీ ఎన్డీయేలోని కూటమి పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. కాగా కేంద్ర కేబినెట్ లో టీడీపీ కి రెండు కేంద్ర మంత్రుల పదవులు, జనసేనకు ఒక కేంద్ర మంత్రి దక్కింది. #tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి