Prathipati Pullarao: టీడీపీ మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకును అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేత కేసులో శరత్ ను అదుపులోకి తోసుకొని కేసు నమోదు చేశారు.

New Update
Prathipati Pullarao: టీడీపీ మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

Prathipati Pulla Rao Son Sharath Arrested: ఏపీలో మరికొన్ని నెలల్లో లేదు మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. ఈ సారి టీడీపీకి నేతల రాజీనామా కాదు.. అదేంటంటే టీడీపీ (TDP) మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకును పోలీసులు అరెస్ట్ చేయడమే.  జీఎస్టీ (GST) ఎగవేశారన్న ఆరోపణలతో శరత్ పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిలకలూరిపేటలో టీడీపీకి చిక్కు..

ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్ర పగ్గాలను తమ చేతిలోకి తీసుకోవాలని వ్యూహాలు రచిస్తున్న టీడీపీకి చిలకలూరిపేటలో చిక్కు ఎదురైంది. దీనికి ప్రధాన కారణం ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్ కావడమే. ఇటీవల ఏపీలో జనసేన తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఎన్నికల్లో పోటీకి దిగే 99 మంది అభ్యర్థులతో తొలి ఉమ్మడి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జాబితాలో చిలకలూరిపేట టీడీపీ జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఎన్నికల సమయంలో అతని కుమారుడు అరెస్ట్ కావడం అక్కడ టీడీపీకి కొంత నెగటివ్ టాక్ వచ్చేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్ కావడం చిలకలూరిపేటలో వైసీపీకి లాభం చేకురుస్తుందా? లేదా టీడీపీకి విజయం చేకురుస్తుందా? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్

ఇది వైసీపీ కుట్ర: ప్రత్తిపాటి

తన కొడుకు శరత్ అరెస్ట్ కావడంపై స్పందించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఓటమి భయంతో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ క్షేత్రంలో ఎదురుకోలేక తప్పుడు కేసులతో వేధిస్తున్నారని అన్నారు. కంపెనీ డైరెక్టర్ గా కానీ.. కనీసం కంపెనీ షేర్ హోల్డర్ గా కానీ శరత్ లేదని తేల్చి చెప్పారు.కంపెనీకి సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు. జగన్ కుట్రలో భాగంగానే పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు