Chandrababu: రేపు భారతితో గొడవైతే నేనే కారణమా?.. జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

AP: రేపు అతనికి, అతని భార్యకు మధ్య విభేదాలు వస్తే, దానికి కూడా నన్ను నిందిస్తాడా? అని సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు చంద్రబాబు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని అన్నారు. సీఎం జగన్ స్వభావంలో నియంత.. ప్రవర్తనలో సైకో అని విమర్శించారు.

New Update
CID Enquiry: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

TDP Chief Chandrababu: ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంటుంది. తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్ పై విమర్శలు చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాను నీచ రాజకీయాలు ఆడుతూ, అతని సోదరి షర్మిలను అతనిపైకి రెచ్చగొడుతున్నానని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

ALSO READ: అజ్మల్ కసబ్ అమాయకుడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

జగన్ స్వభావంలో నియంత.. ప్రవర్తనలో సైకో..

రేపు అతనికి, అతని భార్యకు మధ్య విభేదాలు వస్తే, దానికి కూడా నన్ను నిందిస్తాడా? అని సీఎం జగన్ పై చురకలు అంటించారు. అతనికి, అతని చెల్లెలు షర్మిలది కుటుంబ సమస్య.. అది వరువారు చూసుకోవాలని అన్నారు. సీఎం జగన్ మానసిక స్థితి సరిగా లేదని.. దీనికి కొన్ని స్పష్టమైన సూచనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. స్థిరమైన వ్యక్తి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటాడని... సీఎం జగన్ స్వభావంలో నియంత.. ప్రవర్తనలో సైకో అని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సీఎం జగన్.. రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కేవలం సీఎం జగన్ వద్దే డబ్బులు ఉన్నాయి తప్ప ఏపీలో ప్రజల దగ్గర లేవని పేర్కొన్నారు.

ముస్లింలకు 4 శాతం రిజ్వేషన్లు..

ఏపీలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీపై, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "మొదటి నుండి మేము 4% రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నాము.. త్వరలో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది.. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తాం" అని అన్నారు. కాగా ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం బీజేపీకు షాక్ ఇచ్చినట్లు అయింది. దీనికి కారణం బీజేపీ మరోసారి అధికారంలోకి రాగానే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడమే.

Advertisment
Advertisment
తాజా కథనాలు