Chandra Babu: జగన్‌కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు!

అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ రూ.43వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు.

New Update
Chandra Babu: జగన్‌కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు!

TDP Chief Chandra Babu: ఇంకొల్లులో ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. ఇంకొల్లు సభ చూస్తే సీఎం జగన్ కు నిద్ర పట్టడం లేదని అన్నారు. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించి ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు. ప్రజల పౌరుషం చూడాలని సీఎం జగన్ ను కోరుతున్నానని అన్నారు.

ALSO READ: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

అవినీతితో జగన్ రాజకీయాలు..

అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. మరో 52 రోజులు తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులను పోటీ లో దింపాలని చూస్తున్న జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ అయోమయాంలో పడ్డారని చురకలు అంటించారు.

తొక్కుకుంటూ పోతాం...

తమ విజయానికి వైసీపీ అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకో అంటూ జగన్ కు హితవు పలికారు. నేను కూడా నీ లాగా ఆలోచిస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాడివా? అని సీఎం జగన్ ను నిలదీశారు. తన రాజకీయం ముందు జగన్ ఒక బచ్చా అని అన్నారు. అలంటి బచ్చాలకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. జనం స్పందన చూస్తుంటే ఎన్నికలకు ముందే టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చినట్లు ఉందని హర్షం వ్యక్తం చేశారు.

YSRను అడ్డం పెట్టుకుని...

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సీఎం జగన్ రూ.43వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని అన్నారు. ఏపీకి సీఎం అయ్యాక జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని ఫైర్ అయ్యారు.

ALSO READ: కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు