అందుకే.. జగన్ వై నాట్ 175 అని అంటున్నారు: బోండా ఉమా దొంగ ఓట్ల పై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత బోండా ఉమా. 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఇష్టారీతిన ఓట్లు నమోదు చేస్తున్నందుకే..జగన్.. వై నాట్ 175 అంటున్నారని విమర్శించారు. By Jyoshna Sappogula 16 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP Bonda uma: ఎన్నికల ముసాయిదాలో అవకతవకల పై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దిన్కార్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని కామెంట్స్ చేశారు. కింద స్థాయి అధికారులు ఎన్నికలకు అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. Also read: వైసీపీ సర్కార్‌కు అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు: పురంధేశ్వరి 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయని అన్నారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిగిన తరవాత కూడా తప్పులు ఎందుకు దొర్లుతున్నాయని ప్రశ్నించారు బోండా ఉమా. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 12000 బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. 62 డివిజన్ కార్పొరేటర్ అలంపురు విజయలక్ష్మి పేరు మీద రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని..వీరి కుటుంబంలో మొత్తం 10 దొంగ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దొంగ ఓట్ల పై కలెక్టర్ కు, విఎంసి కమిషనర్ కు ఫిర్యాదు చేశామని వ్యాఖ్యనించారు. Also Read: జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వంచన: నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులకు రెండు ఓట్లు ఇస్తారా.. ఇష్టారీతిన ఓట్లు నమోదు చేస్తున్నారు. అందుకేనా జగన్ వై నాట్ 175 అంటున్నారని విమర్శించారు. ఇదొక ఆర్గనైజింగ్ స్కాం.. ఇప్పటికే అనేక మార్లు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేశాం..చర్యలు మాత్రం శూన్యం అంటూ విమర్శలు సంధించారు. బోగస్ ఓట్లు, దొంగ ఓట్ల పై రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి మీనా కు సాక్షాలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.18 ఏళ్లు నిండినవారు ఓటు నమోదు చేసుకోవాలంటే అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తప్పుడు లెక్కలతో నా గెలుపును నా నియోజక వర్గంలో ఆపేశారని ఆరోపించారు. #tdp-bonda-uma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి