Ayyanna Patrudu: వాలంటీర్లకు రూ. 20 నుంచి 25 వేలు.. మాజీ మంత్రి అయ్యన్న కీలక వ్యాఖ్యలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లను ప్రమోట్ చేస్తామన్నారు మాజీ మంత్రి అయ్యన్న. రూ. 20 నుంచి 25 వేల జీతం ఇస్తామన్నారు. ఉద్యోగం పోతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండలంలోని లచ్చన్నపాలెం గ్రామంలో ఎన్నికల శంఖారావం పూరించారు. By Jyoshna Sappogula 06 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి TDP Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండలంలోని లచ్చన్నపాలెం గ్రామంలో ఎన్నికల శంఖారావం పూరించారు మాజీ మంత్రి, టీడీపీ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను ప్రమోట్ చేస్తామన్నారు. Also Read: ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తులకు లక్షల్లో జీతాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లకు 5000 రూపాయలు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు మీటింగ్ కు వెళ్తే ప్రజలకు పథకాలు తీసేస్తామని వాలంటీర్లను వైసీపీ నాయకులు చెప్పమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. Also Read: ఆ నియోజకవర్గం నుండే గుమ్మనూరు జయరాం పోటీ..! టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు రూ. 20 నుంచి 25 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే వాలంటీర్లును ప్రమోట్ చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగం పోతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎన్నికలు సమయంలో మొదటి సారి ఇక్కడి నుంచే ఎన్నికల సంఖరావం పూరించడం అయ్యన్నకు ఆనవాయతి. దీనిలో భాగంగానే ఈ రోజు రామాలయంలో పూజలు చేసి ఎన్నికలు ప్రచారం చేపట్టారు. #volunteers #tdp-ayyanna-patrudu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి