కనుసైగ చేయండి చాలు..వీరి కథ మేము చూసుకుంటాం: పరిటాల సునీత!
చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు నిరసనగా వైసీపీ రేపు చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
పుంగనూరు ఒక్కసారిగా రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. వైసీపీ నేతల దాడిలో పలువురు టీడీపీ నేతలు, పోలీస్ అధికారులు గాయపడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న పుంగనూరును చంద్రబాబు హింసాకాండగా మార్చారన్నారు.
చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తకరంగా మారింది. చంద్రబాబు పుంగనూరు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరదల వళ్ల ఇళ్లు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద ప్రభావిత ప్రాంత వాసులను పరామర్శించి వారికి కూరగాయలు,, గడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు...శిలాఫలాకాలు వేయడం తప్ప ఏం చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానన్నారు. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి రూ.25 వేల కోట్లు చంద్రబాబు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే జగన్ కంటే మెరుగైన పాలన అందించారని నిరూపిస్తే.. ప్రజలతో చెప్పు దెబ్బలకు సిద్ధమని పోసాని సవాల్ విసిరారు. రాజకీయవేత్తగా కానీ, ఓ మనిషిగా కానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గెలుపుపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిగ్గింగ్ చేసో.. దొంగ ఓట్లతోనే కారణాలు ఏమైనా ఎమ్మెల్యేగా వంశీ గెలిచారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉన్న తనను గన్నవరం తీసుకొచ్చిన జగన్ రోడ్డు మీద పడేస్తారని అనుకోవడం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.