ఆయనది ఓ దిక్కుమాలిన విజన్: పేర్ని!
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బాబు ఓ పక్క, దత్తపుత్రుడు, మరోపక్క, తన సుపుత్రుడు ఇంకోపక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు.. మంచి చేస్తున్న జగన్ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు.
తనపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.
పవన్ తన ప్రసంగాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్న సరే ఏమి పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. హడావిడిగా ప్రజల్లోకి రావడం.. ఏదోకటి ఊగిపోతూ మాట్లాడటం ఆయనకు అలవాటు అయిపోయిందంటూ పేర్ని పవన్ కు చురకలంటించారు.
ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.
నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.