ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది..జగన్ ఆసక్తికర ట్వీట్.! విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గత రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనకు తీవ్రమైన వేదన కలిగించిందని వెల్లడించారు. నడుస్తున్న ఓ రైలు ఆగివున్న మరో రైలును ఢీకొట్టిందని, ఆ రెండు రైళ్లూ ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ భయానక రైలు ప్రమాద ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn