IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.
హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు, వెహికల్స్ పై వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ను చూసుకోని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
వరదల నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ముందుకు వచ్చింది.తమ వంతు సహాకారంగా ఒకరోజు వేతనాన్ని అంటే 100 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలియజేశారు.
భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావంతో ఎంతో మంది ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు తన వంతు సాయంగా NTR రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ చెరొక 50 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు.
తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో సూర్యాపేట- ఖమ్మం, హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. మున్నేరు వాగు చూసేందుకు వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు.స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచిబయటకు వచ్చారు