Raj Tarun : హీరో రాజ్‌తరుణ్‌పై లవర్ లావణ్య సంచలన ఆరోపణలు.. పెళ్లి చేసుకుంటానని, వదిలేసి వెళ్లిపోయాడంటూ!
రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ సినీ నటితో పాటూ ఆమె సోదరుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది.