రాజకీయాలు Etala:ఈటల రూట్ ఎటు? హుజూరాబాద్ ను వదులుకుంటారా? సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి తానే పోటీకి నిలబడుతానని ఈటల గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈటల తన సవాల్ ప్రకారంగా గజ్వేల్ నుంచి నిలబడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. లేదా ఆయన కామారెడ్డి నుంచి సీఎంకు పోటీని ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. లేక ఆయన ఈ సవాల్ నుంచి తప్పుకుంటారా.. అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.. By P. Sonika Chandra 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn