KTR: ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లొ మరో మణిహారం చేరింది. సౌత్ ఇండియాలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత సులుకానుంది.
హైదరాబాద్‌లొ మరో మణిహారం చేరింది. సౌత్ ఇండియాలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత సులుకానుంది.
ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూమి లాక్కుంటే వారు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యర్ జాఫర్ ఇస్లామ్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ స్థాయి ఏదో బీజేపీ పార్టీ స్థాయి ఏదో తెలుస్తుందన్నారు. ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పాలిటిక్స్ పీక్స్ లెవల్‌కు వెళ్లాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో అవినీతి ఎక్కువైపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించగా.. ఎంపీ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే మంచి సమయమని గుత్తా ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో దళిత వర్గాల ప్రజలు అవమానానికి గురవుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామన్నారు
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోనీ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వరంగల్‌లో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగియి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్‌లో పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య భారతదేశమన్నారు. స్వాతంత్ర్య పోరాటం మాధిరిగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటం సాగిందన్న మంత్రి.. రాష్ట్రం ఏర్పడ్డ అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.
సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు రాష్ట్రంలో మూడోదశ ఉద్యమం చేపడుతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్యణ్ ప్రకటించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజలు కృంగి, కృషించి పోయారన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర తరహా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.