KCR: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం.. డేట్స్ ఫిక్స్
ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.
ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.
BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారని..నకిలీ పత్రాలు సృష్టించారని.. ఇదేంటి అని అడిగితే బెదిరించారని రాధిక అనే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనతో పాటు భార్య నీలిమపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని అన్నారు కేసీఆర్. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రజల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ కాంగ్రెస్‌కి జాకీలు పెట్టి మద్దతుగానిలుస్తుందని అన్నారు కేటీఆర్. బండి సంజయ్ మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ.37.43 కోట్లకు కేటాయించారని న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
అబద్దాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏక్ నాథ్ షిండే గా మారకతప్పదని.. త్వరలోనే కేసిఆర్‌ను సీఎంను చేసుకుందామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బట్టలు ఊడదీసి కొడుతాం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్బాషలు ఆడారని బంజారాహిల్స్ పోలీసులకు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో ఐపీసీ 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీ, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని.. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రధాని కాలేడు కదా అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు హరీష్ రావు. రెండు పార్టీలు ఒకటే అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎంత దూరంలో ఉన్నానో... ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నానని అన్నారు.