CM Jagan: సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?
ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఈ రోజు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించాయి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. 2022 లో మాదిరి ఈసారి కూడా ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారట.
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ పోలీస్ కాపాడాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టింది.
ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బుధవారం ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు.