BREAKING: ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 21మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మి షా బదిలీ అయ్యారు.
EX MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక పరిణామం
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోహెల్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేసిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. సోహెల్ ప్రస్తుతం దుబాయిలో ఉన్నాడు.
Mahender Reddy: TSPSC ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అలాగే TSPSC సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావులను నియమించారు.
BREAKING: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణం ఇదేనా?
సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ రోజు సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సమావేశం అయ్యారు. వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. GMR కస్టమర్ కేర్ నెంబర్ కు ఆగంతకుడు మెసేజ్ చేశాడు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హైఅలెర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు సమాచారం.
CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్
సీఎం జగన్ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. రెండు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూల్ సిట్టింగ్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గుమ్మనూరు జయరాం పేరును ఫైనల్ చేశారు. అలాగే.. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి పేరును ఖరారు చేశారు.
BIG BREAKING: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చలాన్లపై రాయితీని పొడిగించింది. ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు 113 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Dharani Poratal: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు
ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్ఏ వ్యవహరించనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/AP-GOVT-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/BRS-EX-MLA-SHAKEEL-SON-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSPSC-NEW-CHAIRMAN-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/brs-mlas-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/SHAMSHABAD-AIRPORT-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AP-CM-Jagan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/DISCOUNT-ON-TRAFFIC-CHALLANS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/DHARANI-REVANTH-jpg.webp)