Asaduddin Owaisi: శాంతి భద్రత విషయంలో తెలంగాణ భేష్
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు.
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని, రానున్న రోజుల్లో తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలున్ని చెంప దెబ్బ కొట్టాలంటూ టీచర్ ఒకరు తన విద్యార్థులకు సూచించారు. యూపీ ఖుబ్బాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థిని కొట్టాలని ఇతర విద్యార్థులకు ట్రాస్టి త్యాగి అనే ఉపాధ్యాయుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
హర్యానాలోని నూహ్‌లో అల్లర్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతను ఏఐసీసీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దీనికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తాను ఆశిస్తున్నట్టు ఓవైసీ వెల్లడించారు. ప్రధాని మోడీ సబ్ కా సాథ్, సబ్ వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదం ఇప్పుడు ఎక్కడ ఉందన్నారు.
వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కాంప్లెక్స్ లో ఆర్కియాలాజికల్ సర్వే జరుగుతున్న సందర్భంలో ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎస్ఐ సర్వే రిపోర్టు వస్తే బీజేపీ మళ్లీ ఓ కథను తెరపైకి తీసుకు వస్తుందన్నారు. అంతకు ముందు అలహాబాద్ హై కోర్టు ఆదేశాలకు ముందు యోగీ ఆదిత్య నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు మారే రోజులు ఎంతో దూరంలో లేవని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.