పెన్షన్ రూ.3,000కు పెంపు...రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచింది. ఆరోగ్య శ్రీ లో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచింది. ఆరోగ్య శ్రీ లో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతా అని అన్నారు.
ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18-30 వరకూ 10వ తరగతి పరీక్షలుంటాయని పేర్కొన్నారు.
సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 11 మంది ఇంఛార్జిలను వైసీపీ పార్టీ మార్చిందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల టికెట్ బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంఛార్జిల మారుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ పార్టీలో అసమ్మతి మొదలైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్ ని కొండేపి ఇంఛార్జిగా అధిష్టాన ప్రకటనను వ్యతిరేకిస్తూ పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేశారు.
జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని సెటైర్లు వేశారు జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అని పేర్కొన్నారు.
నియోజకవర్గ మార్పుపై స్పందించారు మంత్రి మేరుగ నాగార్జున. సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీలో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచేలా అందరు కృషి చేయాలని అన్నారు.