TDP: టీడీపీకి ఎంపీ గల్లా జయదేవ్ గుడ్‌బై!
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారని.. అందుకే చంద్రబాబు జైలులో 52 రోజులు ఉన్నారని వెల్లడించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు జానీ మాస్టర్.
ఏపీ సీఎం జగన్ కు ఇప్పటి నుంచి జగన్ అన్నగారు అని పిలుస్తానని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అధికారంలో ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ, టీడీపీలు బీజేపీకి జపం చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే వస్తుందన్నారు.
మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడొద్దని హెచ్చరించారు షర్మిల. అలా మీరనుకుంటే తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించానని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తనకు ఏపీ పుట్టిన ఇల్లు.. తెలంగాణ మెట్టినిల్లన్నారు. తాను 23 నుంచి జిల్లాల పర్యటన చేస్తానన్నారు.
జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. చంద్రబాబును సీఎం చేసేందుకు షర్మిల ఆలోచిస్తుందని అన్నారు. చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే అని అన్నారు. వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గద్దె దించేందుకు జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీలో జిల్లాల పర్యటనలు చేపడుతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫిబ్రవరి నుంచి క్షేత్రస్థాయిలో సమావేశలు నిర్వహిస్తామని అన్నారు.
ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.
జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దోచుకోవడం.. దాచుకోవడమే అని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదని పేర్కొన్నారు.