Amrutha Pranay: అమృత ప్రణయ్ వెండితెరపై ఎంట్రీ?
వాళ్ళిద్దరూ..బాల్య స్నేహితులు..ఇంజనీరింగ్ వరుకు కలిసే చదివారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. చూడముచ్చటయిన జంట. వీరి ప్రేమ పెళ్లిగా మారడానికి ఇద్దరి కులాలు ప్రతిబంధకంగా మారాయి . అమ్మాయి వైశ్య కులం..అబ్బాయి షెడ్యూల్డ్ కులం. అమ్మాయికి తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదు . అయినా..ఎదిరించి ఆర్యసమాజ్ లో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరికి పండంటి సంతానం కలగబోతోందనే శుభవార్త. కోటి ఆశలతో ఉన్న ఈ జంట జీవితంలో పెను విషాదం. అమ్మాయి తండ్రి కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించాడు అబ్బాయిని. సినిమాను తలపించే ఈ ప్రేమకథ ఎవరిదో అందరికీ తెలిసిందే. అమృత ప్రణయ్ ప్రేమగాథ. ఎందరినో కలచివేసిన అమృత ప్రణయ్ ప్రేమగాథ వెండితెరపై సినిమాగా కూడా వచ్చింది . అమృత ప్రణయ్ వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. ఈ వార్తలో నిజమెంత ?