Supreme Court: సుప్రీం కోర్టులో ఆర్జీకర్‌ హత్యాచార కేసు విచారణ!

ఆర్జీ కర్ ఆస్పత్రి బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఘటనపై దర్యాప్తునకు సీబీఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు… వచ్చే సోమవారం నాటికి తాజా కేసు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

New Update
Supreme Court: సుప్రీం కోర్టులో ఆర్జీకర్‌ హత్యాచార కేసు విచారణ!

Supreme Court: సుప్రీంకోర్టు లో కొనసాగుతున్న కలకత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల హత్యాచార కేసు విచారణ సోమవారం జరిగింది. కలకత్తా హత్యాచార ఘటనపై దర్యాప్తునకు సీబీఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు… వచ్చే సోమవారం నాటికి తాజా కేసు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మంగళవారం సీబీఐ దర్యాప్తు నివేదికపై విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఘటన తర్వాత బాధితురాలి శరీరం పై గాయాలున్నాయని సుప్రీంకోర్టుకు సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎయిమ్స్ కి పంపి పరిశీలించాలని సీబీఐ నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి సొలిసిటరీ జనరల్ తుషార్ తీసుకువెళ్ళారు. దర్యాప్తు లో భాగంగా సీసీటీవీ ఫుటేజిని తాము పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ పేర్కొంది. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టు కి కేంద్రం తెలిపింది. ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద మూడు మహిళా సీఐఎస్ఎఫ్ కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి మాత్రమే వసతులు కల్పించినట్లు కేంద్రం తెలియజేయగా మేము వసతులు కల్పించామని బెంగాల్ ప్రభుత్వం జవాబిచ్చింది.

మూడు వారాల తరువాత సీఐఎస్ఎఫ్ కి సదుపాయాలు కల్పించారని కేంద్రం తెలిపింది. బెంగాల్ లో వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ ను బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. ఇక విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీ కర్ ఆస్పత్రి బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Also Read:  కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు