Ayodhya: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం..

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. రామాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆయన్ను కోరారు. రజనీ ఇంటికి ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు సైతం వెళ్లారు.

New Update
Ayodhya: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం..

Ayodhya Ram Temple inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిథులు, బీజేపీ నాయకుడు అర్జునమూర్తి, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు బుధవారం రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను రామాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గతేడాది ఆగస్టు నెలలో రజనీకాంత్ అయోధ్యలో నిర్మాణ దశలో ఉన్నా రామమందిరాన్ని సందర్శించారు. రామాలయం, హనుమాన్‌గర్హి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అయోధ్యను సందర్శించాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. అయితే, ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానం పంపుతోంది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇందులో భాగంగానే.. ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందజేశారు.

అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 'రామ్ లల్లా' ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రముఖ వ్యక్తులు, మత పెద్దలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సహా దాదాపు 6,000 మంది వ్యక్తులకు ఆహ్వాన లేఖలు పంపనున్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కూడా ఆలయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 2024 జనవరి మూడో వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహాన్ని అసలు స్థలంలో ప్రతిష్టించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు.

Also read:

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment