IPL 2024 : సునీల్ నరైన్ Vs నితీష్ రెడ్డి.. బర్త్ డే బాయ్స్ మధ్య ఫైట్..ఫైనల్లో ట్రోఫితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకునేదెవరు?

IPL ఫైనల్ ఇరు జట్ల ఆటగాళ్లకు ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది. KKR టీమ్ నుంచి సునీల్ నరైన్, SRH నుంచి నితీష్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ రోజే బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఏ ప్లేయర్ ట్రోఫితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

New Update
IPL 2024 : సునీల్ నరైన్ Vs నితీష్ రెడ్డి.. బర్త్ డే బాయ్స్ మధ్య ఫైట్..ఫైనల్లో ట్రోఫితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకునేదెవరు?

IPL 2024 Final : ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్ దశకు చేరుకుంది. మే 26 ఆదివారం చెన్నై (Chennai) లోని చెపాక్ స్టేడియం (Chepauk Stadium) లో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ లో SRHతో KKR తలపడనుంది. ఈ మ్యాచ్ ని తిలకించేందుకు యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సారి జరిగే ఫైనల్ ఇరు జట్ల ఆటగాళ్లకు ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది.

KKR టీమ్ నుంచి సునీల్ నరైన్, SRH నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఫైనల్ మ్యాచ్ రోజే తమ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఏ ప్లేయర్ ట్రోఫితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక వీళ్ళ అనుభవం విషయానికొస్తే.. KKR ప్లేయర్ సునీల్ నరైన్ కి నితీష్ రెడ్డి కంటే ఎక్కవ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది.

Also Read : చెన్నైలో వర్షం.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఏమవుతుంది? 

అయినప్పటికీ ప్రెజెంట్ ఈ ఇద్దరు ఆటగాళ్లు మాంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో సునీల్ నరైన్ ఓపెనర్ గా వచ్చి అదరగొట్టాడు. ఈ సీజన్‌లో అత్యధిక రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌లలో 37.07 సగటుతో మరియు 179.85 స్ట్రైక్ రేట్‌తో 482 పరుగులు చేశాడు. బ్యాట్స్ మెన్ గానే కాకుండా ఆఫ్-స్పిన్నర్ గా కూడా 13 ఇన్నింగ్స్‌లలో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఇక నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో DCకి వ్యతిరేకంగా 37 (27)తో మంచి నాక్ ఆడాడు మరియు కుడి-చేతి సీమ్‌తో 2/17 కైవసం చేసుకున్నాడు. RRకి వ్యతిరేకంగా ఈ సీజన్‌లో 76 (42) తన అత్యుత్తమ నాక్ ఆడాడు. అలా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఫైనల్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ నాక్ ఆడి ట్రోఫితో బర్త్ డే ని మరింత స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంటారో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mango Shake: వేసవిలో మ్యాంగో షేక్‌ను కొందరు మాత్రం తాగకూడదు

పాలు, మామిడి ముక్కలు కలిపి తయారు చేసే మ్యాంగో షేక్ వేడి వాతావరణంలో శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందించి అలసటను తగ్గించగలదు. అయితే మామిడి షేక్‌ను తాగడంలో కొంత మితిమీరిన వినియోగం హానికరం కావచ్చు. మధుమేహం ఉంటే మామిడి షేక్‌ను దూరంగా ఉంచాలి.

New Update
Mango Shake

Mango Shake

Mango Shake: వేసవి వేడిలో మామిడి షేక్ తాగడం చాలా మంది ఇష్టపడే అలవాటు. మామిడి పండ్ల రుచితో పాటు, చల్లదనం కూడా అందించే ఈ షేక్ శరీరానికి తాత్కాలికంగా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ ఆరోగ్య పరంగా ఈ పానీయం కొందరికి మంచిది, మరి కొందరికి సరిపోదు. పండ్లలో రాజుగా పరిగణించబడే మామిడి పండ్లలో విటమిన్ A, C, E, K, B6, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థను సమర్థంగా పనిచేయించడంలో, చర్మానికి ఆరోగ్యాన్ని ఇచ్చేలా సహాయపడతాయి.

బరువు తగ్గాలంటే ..

పాలు, మామిడి ముక్కలు కలిపి తయారు చేసే మ్యాంగో షేక్ వేడి వాతావరణంలో శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందించి అలసటను తగ్గించగలదు. అయితే మామిడి షేక్‌ను తాగడంలో కూడా కొంత మితిమీరిన వినియోగం హానికరం కావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు మామిడి షేక్‌ను దూరంగా ఉంచాలి. మామిడి షేక్‌లో సహజంగానే చక్కెర అధికంగా ఉండటమే కాకుండా మనం అదనంగా చక్కెరను కలిపే విధానం దీన్ని మరింత ప్రమాదకరంగా మార్చుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు, కాలేయ సమస్యలు ఉన్నవారు, అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ షేక్‌ను తక్కువగా తాగడం మంచిది.

ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్‌

మామిడి షేక్ రుచికరమైనదే అయినా రోజుకు ఒక చిన్న గ్లాసుకు పరిమితం చేయాలని అన్నారు. అదనంగా చక్కెర, ఐస్‌ క్రీమ్, క్రీమ్ వంటి పదార్థాలను కలపకుండా తినడం ఉత్తమం. మామిడి పండ్లను సహజంగా తీసుకోవడం, లేక షేక్‌ను తక్కువ మోతాదులో తాగడం వల్ల ఆరోగ్యాన్ని హానికరం కాకుండా మేలు చేస్తుంది. వేసవి కాలంలో మామిడి షేక్ తాగవచ్చు కానీ  అది మిత మీరకుండా, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని తాగాలి. మీకు డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే  డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సరైన ఆహారం, పరిమిత మోతాదు అన్నివేళలా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: మహిళలు థైరాయిడ్ బాధితులుగా ఎందుకు మారుతున్నారు?

( mangoes | mango-leaves | mango-lassi | mangoes-tips | latest-news I health-tips | latest health tips | best-health-tips | health tips in telugu )

Advertisment
Advertisment
Advertisment