Kerela Chicken Roast: సండే స్పెషల్.. కేరళ చికెన్ రోస్ట్.. ట్రై చేయండి అదిరిపోతుంది సండే అంటే ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్ ఉండడం కామన్. ఎప్పుడు ఒకే స్టైల్ లో చికెన్ తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే ఈ సారి మీ సండే మరింత స్పెషల్ గా ఉండడానికి.. క్లాసిక్ కేరళ చికెన్ రోస్ట్ ట్రై చేయండి అదిరిపోతుంది. రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 27 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Kerela Chicken Roast: నాన్ వెజ్ అనగానే చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు కొంత మందికి రోజూ రోజూ చికెన్, మటన్ పెట్టినా తినేంత ఇష్టం ఉంటుంది. అయితే నాన్ వెజ్ లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా చికెన్ తో డిఫెరెన్ వెరైటీస్ చేసుకొని తినొచ్చు. సాధారణంగా ప్రతీ ఇంట్లో సండే అనగానే ఏదో ఒక స్పెషల్ లేదా నాన్ వెజ్ ఐటమ్ ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ వీకెండ్ మీ సండే మరింత స్పెషల్, టేస్టీ గా ఉండడానికి కొత్తగా క్లాసిక్ కేరళ చికెన్ రోస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేరళ చికెన్ రోస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు చికెన్: 350 గ్రాములు, వెల్లుల్లి : 10 గ్రాములు, అల్లం : 10 గ్రాములు, కోకోనట్ ఆయిల్: 80 ml, గ్రీన్ చిల్లీస్: 2, టమోటోస్: 40 గ్రాములు, ఉల్లిపాయలు: 90 గ్రాములు, ఉప్పు: రుచికి సరిపడ, కొత్తిమీర: 10 గ్రాములు, చిల్లి పౌడర్: 10 గ్రాములు, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా: 5 గ్రాములు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని.. దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టమాటోలు వేసి.. మెత్తగా అయ్యేవరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించాలి. ఉడికేటప్పుడు మిరియాల పొడి, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మంట ఎక్కువగా ఉంచితే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సన్నని మంట పై మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత బాగా ఉడికిన ఈ టమోటో మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి.. గ్రేవీ అన్ని ముక్కలకు పెట్టెలా బాగా కలపండి. ఇక ఇప్పుడు మూత పెట్టేసి మీడియం మంట పై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..! చివరిగా కాస్త గరం మసాలా వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచండి . చికెన్ బాగా దగ్గర పడిన తర్వాత.. తీసి ఒక బౌల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాని పై కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ, యమ్మీ సండే స్పెషల్ కేరళ చికెన్ రోస్ట్ రెడీ. తినే విధానం ఈ యమ్మీ రోస్టెడ్ చికెన్ చాలా రకాలుగా తినొచ్చు. బ్రెడ్, పొలావ్, చపాతీ, పరోటా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ట్రై చేయొచ్చు. దీనిలోని కోకోనట్ ఆయిల్ స్పెషల్ టేస్ట్ వచ్చేలా చేస్తుంది. Also Read: Round Wells: గుండ్రని బావులే ఎందుకు.. దీని వెనుక స్టోరీ ఇదే..! #sunday-special #kerela-style-chicken-roast మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి