KTR Tour:సడెన్ గా కేటీఆర్ అమెరికా టూర్ వాయిదా.. అందుకేనా! మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ సడెన్ గా వాయిదా పడింది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న క్రమంలో టూర్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ చేతుల మీదుగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా లిస్ట్ ను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. By P. Sonika Chandra 17 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి KTR Tour: మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ సడెన్ గా వాయిదా పడింది. ఆయన షెడ్యూల్ ప్రకారంగా అయితే గురువారం ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు బయల్దేరాల్సి ఉండే. ఆయన కుమారుడిని గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించడానికి వెళ్లాలనుకున్నారు. కాని రానున్న ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న క్రమంలో టూర్ వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా, శ్రావణ మాసం మొదలు కావడంతో పార్టీల్లో హడావుడి మొదలైంది. అన్నీ పార్టీలు కూడా తమ జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో అన్నీ అనుకూలిస్తే రేపే బీఆర్ఎస్ తన ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ఒక వేళ శుక్రవారం ఏదైనా పరిస్థితుల్లో మార్పులు, చేర్పులు, సవరణలు చేయాల్సి వచ్చి జాబితా విడుదల వాయిదా పడితే మాత్రం.. ఈ నెల 24 న ఆ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సారి కేటీఆర్ చేతుల మీదుగానే..! అయితే ప్రతిసారి ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ ను పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడనుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చడం జరిగింది. దీంతో కేసీఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు అవుతారు. ఇక తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ చేతుల మీదుగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా లిస్ట్ ను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో.. అప్రకటితంగా ఆయనే రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను చూసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ కేటీఆర్ అమెరికా టూర్ ను వాయిదా వేయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత కేటీఆర్ అమెరికాకు వెళతారు. లిస్ట్ విడుదలలో.. మళ్లీ అదే కేసీఆర్ సెంటిమెంట్! అయితే రానున్న ఎన్నికల కోసం బరిలోకి దింపుతున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసే విషయంలో ఎప్పటిలాగే ఈ సారి కూడా తన సెంటిమెంట్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ లక్కీ నెంబర్ 6. దీంతో ఫస్ట్ లిస్ట్ లో అభ్యర్థుల నెంబర్ 66 లేదా 87 లేదా 96 లేదా 105 ఉండే ఛాన్స్ ఉంది. కాగా, చాలా రోజుల నుంచి అభ్యర్థుల జాబితాపై ముమ్మర కసరత్తు చేసిన గులాబీ బాస్ టికెట్ ఎవరెవరికి ఇవ్వాలనేది దాదాపుగా డిసైడ్ అయ్యారు. అయితే ఎలాంటి వివాదం లేదని నియోజకవర్గాల స్థానాలన్నీ ఈ ఫస్ట్ లిస్ట్ లో ఉండే అవకాశముంది. మరోవైపు ఈ లిస్ట్ పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. #brs-mla-candidates-first-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి