/rtv/media/media_files/2026/04/01/ipl-2026-lsg-vs-dc-2026-04-01-06-53-31.jpg)
IPL 2026 LSG vs DC
IPL 2026 LSG vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో ఐదో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 1, బుధవారం సాయంత్రం 7:30 గంటలకు లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
మ్యాచ్ ప్రివ్యూ
ఈ సీజన్‌లో లక్నో జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్‌లో నిరాశ కలిగించిన తర్వాత ఈసారి మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వాలని వారు చూస్తున్నారు. జట్టులో ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. బ్యాటింగ్ బలం మీదే ఎక్కువగా ఆధారపడే జట్టు ఇది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్ కెప్టెన్. గత సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఈ జట్టు, ఈసారి ప్లే ఆఫ్స్‌కి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ వంటి ఆటగాళ్లు జట్టులో స్థిరంగా ప్రదర్శన ఇస్తున్నారు.
మ్యాచ్ వివరాలు
- మ్యాచ్: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- తేదీ: ఏప్రిల్ 1, 2026
- సమయం: సాయంత్రం 7:30
- వేదిక: ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
- LIVE ప్రసారం: జియోస్టార్ ఛానెల్స్ మరియు జియోహాట్‌స్టార్ యాప్
పిచ్ రిపోర్ట్
లక్నో పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు సులభం కాదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సగటు స్కోర్ 150-160 మధ్యలో ఉంటుంది. మ్యాచ్ క్రమంగా ముందుకు వెళ్లే కొద్దీ బ్యాటింగ్ కష్టం అవుతుంది. క్రమంగా బౌలర్లకు అనుకూలంగా మారుతుంది.
హెడ్ టు హెడ్ రికార్డ్
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 7 మ్యాచ్‌లు ఆడాయి.
- లక్నో గెలిచింది: 3
- ఢిల్లీ గెలిచింది: 4
అంచనా జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అయుష్ బదోని, అబ్దుల్ సమద్, అన్రిచ్ నోర్ట్జే, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ రాథి
ఇంపాక్ట్ ప్లేయర్: షాహ్‌బాజ్ అహ్మద్
ఢిల్లీ క్యాపిటల్స్: పతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ఆశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, ఔకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి
ఇంపాక్ట్ ప్లేయర్: టి. నటరాజన్
కీలక ఆటగాళ్లు
బెస్ట్ బ్యాటర్ (అంచనా): కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో చాలా స్థిరంగా ఆడే ఆటగాడు. ఇప్పటివరకు 5000కు పైగా పరుగులు చేశాడు. ఈ పిచ్‌లో ఓపెనర్‌గా మంచి ఆరంభం ఇస్తే జట్టుకు బలమైన స్కోర్ వస్తుంది.
బెస్ట్ బౌలర్ (అంచనా): దిగ్వేష్ రాథి
యువ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి గత సీజన్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ దిశ మార్చే సామర్థ్యం ఉంది.
పిచ్ పరిస్థితులు, జట్ల బలం చూసుకుంటే, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఢిల్లీ జట్టు మంచిగా కనిపిస్తున్నా, లక్నో జట్టు హోమ్ గ్రౌండ్ వల్ల గెలిచే అవకాశము లేకపోలేదు. మొత్తానికి ఈరోజు టఫ్ మ్యాచ్ ఉండడం మాత్రం కాయంగా కనిపిస్తోంది.
Follow Us