/rtv/media/media_files/2026/02/15/sharma-2026-02-15-20-32-27.jpg)
కొలంబోలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా బరిలోకి దిగిన అభిషేక్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ అయి అభిమానులను నిరాశపరిచాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికే అభిషేక్ శర్మ అవుటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో తన ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన అభిషేక్, టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ సున్నాకే అవుటైన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు.
గోల్డెన్ డకౌట్
ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఆయన గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే అవుట్) అయిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా నమీబియాతో జరిగిన రెండో మ్యాచ్‌కు దూరమైన ఆయన, కోలుకుని పాక్‌పై బరిలోకి దిగినా అదృష్టం కలిసిరాలేదు.
గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా ప్రపంచకప్‌లో వరుసగా డకౌట్లు అయినప్పటికీ, అవి ఆయన కెరీర్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు కావు. అలాగే గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు కూడా ప్రపంచకప్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు సున్నాకే అవుటయ్యారు. కానీ, అరంగేట్ర ప్రపంచకప్‌లో ఆడిన మొదటి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అవ్వడం మాత్రం అభిషేక్ శర్మకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది.
Follow Us