Prakasam Barrage: శరవేగంగా ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్లు AP: ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రెండు పడవలు బ్యారేజిలోని 67, 69 గేట్లను ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు గేట్లు విరిగిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు బాహుబలి మిషన్తో పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. By V.J Reddy 07 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాహుబలి మిషన్ రంగంలోకి దిగింది. ఇటీవల 2 భారీ పడవులు ఢీకొని బ్యారేజిలోని 67, 69 గేట్లు విరిగిపోయాయి. విరిగిపోయిన గేట్ల కౌంటర్ వెయిట్స్ ఇప్పటికే అధికారులు తొలిగించారు. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 67, 68 , 69 గేట్ల మధ్య ఇరుక్కుపోయిన 2 భారీ పడవలను బయటకు తీసేందుకు ప్రత్యేక బాహుబలి మిషన్ను అధికారులు తెచ్చారు. 67, 69 గేట్లను మూసేసి భారీ పడవలను బయటకు తీసి విరిగిపోయిన గేట్లకు కౌంటర్ వెయిట్స్ బిగిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ జెండా రంగులో ఉన్న పడవలు ఢీకొన్నాయి అని.. ఇది వైసీపీ నేతలు కుట్ర అని సోషల్ మీడియాలో టీడీపీ విమర్శల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ అడిగిన కుట్ర అని ఆరోపణలు చేస్తోంది. #prakasam-barrage సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి