Speed Challan: స్పీడ్‌ చలాన్‌లకు ఇలా చెక్‌ పెట్టండి.. గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్‌

లెఫ్ట్‌ తీస్కో, రైట్‌కు తిరుగు అని చెప్పడంతో పాటు "నీకు స్పీడ్‌ ఎక్కువైంది, తగ్గించుకో" అని కూడా ఇక గూగల్‌ మ్యాప్సే చెప్తుందట. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. స్పీడ్ లిమిట్ దాటిందంటే గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది.

New Update
Speed Challan: స్పీడ్‌ చలాన్‌లకు ఇలా చెక్‌ పెట్టండి.. గూగుల్‌ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్‌

Google Maps Update: గాల్లో తేలినట్టుందే.. అంటూ రోడ్డుమీదే కార్లో దూసుకుపోతుంటే! ఏముంది.. ఓ చలాన్‌తో స్పీడ్‌ గన్‌ షూట్‌ చేసి పడేస్తుంది. మీకూ ఇప్పటికే చాలా స్పీడ్‌ చలాన్‌లు పడే ఉంటాయి కదా.. అలాంటప్పుడే "స్పీడ్‌ తగ్గించరా బాబూ" అని గట్టిగా చెప్పేవారెవరైనా పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడలాంటి ఏర్పాటు రానేవచ్చింది. లెఫ్ట్‌ తీస్కో, రైట్‌కు తిరుగు అని చెప్పడంతో పాటు "నీకు స్పీడ్‌ ఎక్కువైంది, తగ్గించుకో" అని కూడా గూగల్‌ మ్యాప్సే చెప్తుందట.

ఇది కూడా చదవండి: ముంచుకొస్తున్న మిచౌంగ్.. అప్రమత్తమైన అధికారులు

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, వివిధ ప్రాంతాల్లో స్పీడ్‌ లిమిట్‌ క్రాస్‌ చేస్తే జరిమానా ఎదుర్కోక తప్పదు. అలాంటి సమయాల్లో వాహనం స్పీడ్‌ లిమిట్ దాటిందంటే, వెంటనే అలర్ట్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ వచ్చిచేరింది. లిమిట్‌ దాటితే వెంటనే అలర్ట్‌ చేస్తుంది. ఇందుకోసమే రియల్‌ టైం స్పీడ్‌ లిమిట్‌ సమాచారం డ్రైవర్‌కు సూచించేలా గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ వచ్చింది. దీంతో లిమిట్‌కు మించిన వేగంతో పోనిస్తే వెంటనే అలర్ట్‌ వస్తుంది. స్ట్రీట్‌ వ్యూ ఫొటోలు, థర్డ్‌ పార్టీ ఫొటోల సాయంతో గూగుల్ స్పీడ్‌ లిమిట్‌ గుర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: “అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. ఇది కరెక్ట్ కాదు”.. యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్..!

దీన్ని ఎనేబుల్‌ చేసుకోవడం కోసం మొబైల్‌లోని ‘గూగుల్ మ్యాప్స్‌’ యాప్‌ను ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌ ఐకాన్‌లో ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్లాలి. స్క్రీన్‌ని కొద్దిగా కిందికి తోస్తే అక్కడ నావిగేషన్‌ సెట్టింగ్స్‌ (Navigation settings) అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేసుకుని అందులో డ్రైవింగ్‌ ఆప్షన్స్‌ (Driving options) క్లిక్‌ చేయాలి. అక్కడున్న ఫీచర్లలో స్పీడో మీటర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికైతే ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు