Roshan Kumar : నియోజకవర్గ సమస్యలకు పరిష్కరం కావాలంటే.. ఇలా జరగాలి..! ఏలూరు జిల్లా సుప్రీం పేట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. By Jyoshna Sappogula 05 May 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Songa Roshan Kumar : ఏలూరు(Eluru) జిల్లా చింతలపూడి మండలంలోని సుప్రీం పేట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. రోషన్ కుమార్ మాట్లాడుతూ.. సుప్రీంపేట అంటే తన సొంత ఊరు తన సొంత ప్రజలని.. వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలు తాను ఎప్పటికీ గుర్తించుకుంటానన్నారు. Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? తాను నామినేషన్ వేసింది తన కోసం కాదని, చింతలపూడి నియోజకవర్గ యువత కోసం అభివృద్ధి కోసమేనన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటన్నిటినీ పరిష్కరించాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. #eluru-district #ap-tdp #songa-roshan-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి