బీజేపీతో వెళ్లేలా నన్ను ఒప్పించాలని కొందరు చూస్తున్నారు... శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు...!

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లాలని తనను ఒప్పించేందుకు కొందరు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో రహస్య భేటీపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ తన మేనల్లుడు అనే విషయం అందరికీ తెలుసన్నారు. మేనల్లునితో సమావేశం కావడంలో ఏదైనా తప్పు వుందా అని ప్రశ్నించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి మరో వ్యక్తిని కలవాలనుకుంటే దానిలో ఏ సమస్య వుంటుందని అడిగారు.

author-image
By G Ramu
New Update
Ayodhya Ram Mandir : రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిరానికి శంకుస్థాపన జరిగింది:శరద్ పవార్..!!

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లాలని తనను ఒప్పించేందుకు కొందరు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లబోదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీతో ఎలాంటి అనుబంధం కూడా ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదని ఆయన వెల్లడించారు.

మహారాష్ట్రలో షోలాపూర్ లోని సంగోలా నియోజక వర్గంలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమలో కొందరు(అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం) భిన్నమైన వైఖరిని తీసుకున్నారని అన్నారు. మా వైఖరిలో ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అని తమ శ్రేయోభిలాషులు కొందరు చూస్తున్నారని ఆయన వెల్లడించారు.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో రహస్య భేటీపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ తన మేనల్లుడు అనే విషయం అందరికీ తెలుసన్నారు. మేనల్లునితో సమావేశం కావడంలో ఏదైనా తప్పు వుందా అని ప్రశ్నించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి మరో వ్యక్తిని కలవాలనుకుంటే దానిలో ఏ సమస్య వుంటుందని అడిగారు. అజిత్ తన మేనల్లుడని, కుటుంబంలో తాను సీనియర్ వ్యక్తినన్నారు. తామిద్దరం కలిసి మాట్లాడుకోవడంలో రహస్యం ఏముంటుందన్నారు.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం రహస్యంగా భేటీ అయ్యారు. పుణేలోని పారిశ్రామిక వేత్త అతుల్ చోర్దియా నివాసంలో వారిద్దరూ పలు విషయాలపై చర్చించనట్టు తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. దీంతో వీరి మధ్య రహస్య భేటీకి కారణం ఏమై వుంటుందని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు