Song: ఇంకా దుమ్ములేపుతోన్న సీమ దసర సిన్నోడు సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో తెలుసా? సీమ దసర సిన్నోడే.. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాట పై నెటిజన్లు కొన్ని వేలకు పైగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట యుట్యూబ్ లో 43మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. By Archana 11 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Song: సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదిక పై ప్రదర్శిస్తూ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు టీవీల్లో, సినిమాల్లో కనిపిస్తేనే టాలెంట్ ను గుర్తిస్తారు అనుకునే పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు టాలెంట్ ను ప్రదర్శించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్, యు ట్యూబ్ ఇలా పలు సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్దగా ఖర్చు లేకుండానే తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఎంతో మంది గుర్తింపు పొందుతూ సెలబ్రేటీలుగా మారుతున్నారు. ఎంత కష్టపడ్డా అవకాశాలు రాని అనేక మంది.. వాళ్ళ టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులలో ఫేమస్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నచాలా మందికి సినిమాల్లో కూడా అవకాశాలు లభిస్తుండడం విశేషం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సీమ దసర చిన్నోడే సాంగ్.. ఈ పాటకు నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. యుట్యూబ్ లో ఈ పాట చూసిన ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించేది.. ఈ పాట సందడి ఇంకా సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య కాలంలో అయితే.. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా.. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఓపెన్ చేసినా.. ఈ పాటకు సామాన్యులు డ్యాన్స్ చేసిన వీడియోలే కనిపించేవి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరు ఈ పాట రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు. ఈ సీమ దసర చిన్నోడే పాట ముఖ్యంగా.. పల్లెటూరు ప్రజలను ఉర్రూతలూగించింది. పల్లెటూరు పొలాల్లో ఈ పాట పై ఆడవాళ్లు రీల్స్ చేస్తూ చిందులేయడమే ఇందుకు నిదర్శనం. అయితే.. బాగా ట్రెండ్ అయిన ఈ పాట యూట్యూబ్ వ్యూస్ లో ఇంకా దుమ్ములేపుతూనే ఉంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమా పాటలకు కూడా రానన్నీ వ్యూస్ ఈ పాట సొంతం చేసుకోవడం చూస్తే షాకవ్వాల్సిందే.. మూడు నెలల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటివరకు 43 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇంకా రోజు రోజుకూ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో దుమ్ము లేపిన సీమ దసర చిన్నోడే.. పాటను ఉషక్క, నిఖిత పాడగా.. శేఖర్ కొరియోగ్రాఫీ అందించారు. వర్షిణి, రమ్యశ్రీ హీరోయిన్లుగా నటించి తమ అద్భుతమైన డ్యాన్స్ తో దుమ్ములేపగా.. శివ అయ్యోరీ హీరోగా అదరగొట్టాడు. డీఓపీ అరుణ్ అందించారు. Also Read: Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ కెప్టెన్సీ రద్దు.. ప్రశాంత్ కు పెద్ద షాకిచ్చిన శివాజీ..! #seema-dasara-chinnode #folk-song #social-media-trend-seema-dasara-chinnode #seema-sasara-chinnodu-song మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి