AP Politics: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..! రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి సిద్ధం చేసిన నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందించారు. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు గుర్తించారు. By Jyoshna Sappogula 20 May 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP Politics: ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రగడ నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీ - టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపైఒకరు దాడులు చేసుకుంటూ రాష్ట్రంలో రచ్చ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన అల్లర్లపై రిపోర్ట్ ఇవ్వాలని ఈసీ సిట్ ఏర్పాటు చేసింది. Also Read: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.! ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి సిద్ధం చేసిన నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందించారు. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు గుర్తించారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈవో, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. Also Read: హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు హై అలర్ట్..! అయితే, పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2 రోజుల పాటు 3 జిల్లాల్లోని బాధితులు, రాజకీయనేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. తాడిపత్రిలో పోలింగ్ రోజు గొడవ జరిగిన ప్రాంతాల్ని పరిశీలించిన సిట్ బృందం.. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, సీసీ కెమెరాల ద్వారా అల్లర్లకు కారణమైన వారి గుర్తించారు. #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి