Singer Mangli: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్ మంగ్లీ.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?

సింగర్ మంగ్లీ పెళ్ళికి సంబంధించి, తను పెళ్లి చేసుకోబోయేది ఎవరు అనే విషయం పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి

New Update
Singer Mangli: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్ మంగ్లీ.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..?

Singer Mangli:  సింగర్(Singer) మంగ్లీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు ఆమెకు ఉండే ఆ ప్రత్యేకమైన వాయిస్ తో అందరి మనసుల్ని దోచుకుంది. మంగ్లీ పాడిన జానపద పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రేక్షకులలో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ ఈమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినది.. మంగ్లీ కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా పూర్తి చేసింది.

ఒక ఛానెల్ లో యాంకర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టిన మంగ్లీ, పట్టుదలతో సొంతగా ఆల్బమ్స్ చేసింది. జానపద గాయిని గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంగ్లీ పాడే పాటలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉంటాయి. తెలంగాణాలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగలైన బతుకమ్మ, సమ్మక్క -సారక్క ల పై తను చేసిన ఆల్బమ్స్ తనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

తెలంగాణ పండుగలకు సంబంధించి తను పాడిన పాటలు ప్రతి గ్రామాల్లో వినిపిస్తాయి. ఆమె ఎంచుకునే జానపద పాటలు పల్లె ప్రజల మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. కెరియర్ ను స్టార్ట్ చేసిన కొంత కాలంలోనే సింగర్ గా మంచి గుర్తింపు పొందారు.

ఒక జానపద గాయినిగా తన జీవితాన్ని మొదలు పెట్టిన మంగ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో పాటలు పాడి మంచి ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప(Pushpa) సినిమాలో మంగ్లీ పాడిన "Oo Antava Oo Oo Antava" సాంగ్ ఆమెకు ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది.

తన కెరియర్ లో బిజీ బిజీ గా ఉంటున్న మంగ్లీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాల్లో బిజీగా ఉన్న మంగ్లీ తను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని త్వరగా పూర్తి చేసుకొని పెళ్లి పనుల్లో బిజీ అవుతున్నట్లు నెట్టింట్లో వార్తలు జోరుగా సాగుతున్నాయి.

అయితే మరి తను పెళ్లి చేసుకోబోయేది తన బావనే అంటూ వార్తలు వినిపించాయి. డిసెంబర్ నాటికి పెళ్లి అవ్వబోతుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన పెళ్ళికి సంబందించిన పనుల్లో బిజీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమాలో పూజాహెగ్డేని అందుకే తీసేశాం: నాగవంశీ 

Advertisment
Advertisment
తాజా కథనాలు