సింగపూర్ లో 20 ఏండ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరి...!

సింగపూర్‌లో సుమారు 20 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష విధించ బోతున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సారిదేవి(45)ను ఈ నెల 28న ఉరి తీయనున్నారు. ఆమెతో పాటు ఇదే కేసులో మరో వ్యక్తి(56)ను ఈ నెల 26న చాంగీ జైలులో ఉరి తీయబోతున్నట్టు అధికారులు వెల్లడించారు.

New Update

Singapores Execution Spree Continues to Hang First Woman in Nearly Two Decades

అక్రమంగా 30 గ్రాముల హెరాయిన్‌ను రవాణా చేసిన కేసులో సారిదేవి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో సారదేవీకి ఉరిశిక్షకు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించి ఆ మహిళ కుటుంబ సభ్యులకు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ (టీజేసీ) నోటీసులు పంపించింది. ఈ ఉరిశిక్ష అమలైతే గత ఇరవై ఏండ్లలో ఓ మహిళకు ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి అవుతుంది.

అంతకు ముందు 2004లో యెన్ మే వుయెన్ అనే మహిళకు ఉరిశిక్ష విధించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలడంతో ఆమెకు ఉరిశిక్ష అమలు చేశారు. ఇక ఈ ఇద్దరు నిందితులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని హక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాలు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు సింగపూర్ లో అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నారు. సింగపూర్ లో ఎవరైనా 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేస్తే వారికి న్యాయస్థానం మరణ శిక్షలు విధిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు