Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే శరీరంలో అది తక్కువైనట్లే

శరీరానికి అన్ని పోషకాలు చాలా ముఖ్యం. వాటిలో ఒకటి విటమిన్ విటమిన్ D. ఈ పోషకాహార లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలసట, గాయాలు మానకపోవడం, స్ట్రెస్, వెన్ను నొప్పి, విటమిన్ D లోపం లక్షణాలు.

New Update
Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే శరీరంలో అది తక్కువైనట్లే

Health Tips: సహజంగా విటమిన్ డి సూర్యరష్మీ ద్వారా శరీరానికి అందుతుంది. ఎముకల దృఢత్వం, రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ D లోపం ఉందని చెప్పే లక్షణాలు ఇవే..

విటమిన్ D పోషకాహార లోపం వల్ల కలిగే లక్షణాలు

వెన్ను నొప్పి

ఎముకల దృఢత్వాన్ని విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ D శరీరంలో క్యాల్షియం శోషణు మెరుగుపరిచి.. ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన కండరాల పని తీరుకు సహాయపడుతుంది. విటమిన్ డి తక్కువగా ఉన్న వారిలో విపరీతమైన వెన్ను, కండరాళ్ళ నొప్పులు ఉంటాయి.

స్ట్రెస్

మానసిక ఆరోగ్యం పై విటమిన్ D తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. డిప్రెషన్ విటమిన్ డి లోపం లక్షణం. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటారు. విటమిన్ డి లోపం ఉన్నవారు ప్రతీ రోజు ఒక 15 నిమిషాల పాటు ఎండలో ఉండడం మంచిది. అలాగే డైలీ డైట్ లో విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

publive-image
అలసట

విటమిన్ డి లోపం ఉన్నవారిలో తరచుగా అలసట, నీరసం కనిపిస్తాయి. తల నొప్పి, నిద్ర లేమి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విటమిన్ డి లెవెల్స్ చేస్ చేసుకోవడం మంచిది.

గాయాలు మానకపోడం

గాయాలు మానడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారిలో గాయాలు, వాపు త్వరగా తగ్గకపోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అలాగే డయాబెటీస్ టెస్ట్ కూడా చేయించుకోవడం ఉత్తమం.

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Operation Valentine Trailer: “ఏం జరిగిన చూస్కుందాం” .. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్

Advertisment
Advertisment
తాజా కథనాలు