Navratrulu: మరి కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు.. పూజ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటే?

నవ రాత్రులు..నవ అంటే రెండు అర్ధాలు ఉన్నాయి..ఒకటి కొత్త అని..మరొకటి తొమ్మిది అని. ఈ నవరాత్రుల వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది..

New Update
Navratrulu: మరి కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు.. పూజ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటే?

మరి కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు (Navaratrulu) మొదలు కాబోతున్నాయి. ప్రతి ఏడాది ఎంతో అట్టహాసంగా జరుపుకునే ఈ నవరాత్రుల గురించి చాలా మందికి తెలియదరు. అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు..ఎలా జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం.నవ రాత్రులు..నవ అంటే రెండు అర్ధాలు ఉన్నాయి..ఒకటి కొత్త అని..మరొకటి తొమ్మిది అని.

ఈ నవరాత్రుల వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది..పూర్వం దుర్గాదేవి శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు ఉండే వారు. వారిద్దరూ దేవతలను, మునులను, ముని పత్నులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వారు. శంభుడు, నిశంభుడు ఇద్దరు కూడా బ్రహ్మ నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు.

కానీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన మహిళ చేతిలో మాత్రమే తమకు మరణం కావాలని కోరుకుంటారు. బ్రహ్మా ఆ వరాన్ని వారికి ప్రసాదించాగా గర్వం తలకెక్కిన రాక్షసులు దేవతలను హింసించడం మొదలెట్టారు. రోజురోజుకి వారి అరాచకాలు పెరిగిపోవడంతో వారిని మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి, కాళికా, కళరాత్రిగా ఉద్భవించింది.

కాళికా దేవికి సాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. అమ్మవారు నవరాత్రి దేవతలుగా ఉద్భవించి శంభుడు, నిశంబులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవిని స్తుతించారు. అందుకే దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.

కొన్ని పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణాసురుడ్ని చంపింది కూడా విజయ దశమి రోజునే అని చెబుతున్నాయి. ఆ ప్రకారం..దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నారని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏం చేయాలి.. ఏం చేయకూడదు ? అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం..

ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా క్రమం తపపకుండా గుడికి వెళ్లాలి. అమ్మవారి ముందు నిత్యం దీపం పెట్టాలి. నవరాత్రి సమయంలో అమ్మవారికి నిత్యం నీటిని సమర్పించడం చాలా మంచింది. ప్రతి రోజూ కూడా శుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పాదరక్షలు వేసుకోకుండా ఉంటే మంచిది. గుమ్మానికి దగ్గరగా చెప్పులు వదలకుండా.. దూరంగా ఉంచాలి.

ఈ తొమ్మిది రోజులు కూడా ఉపవాసం చేయగలిగిన వాళ్లు.. ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిదే.
అమ్మవారికి అలంకారమంటే ప్రీతికరం. సౌభాగ్య ప్రదాయిని దుర్గాదేవి. కాబట్టి.. అమ్మవారిని గాజులు, పూలు, పసుపు, పూల మాలలు, వస్త్రాలతో నిత్యం అలంకరించాలి.

నవరాత్రుల్లో అష్టమి రోజు కన్యా పూజ చేయాలి నవరాత్రులు అమ్మాయిలకు ముఖ్యమైనవి. అష్టమి రోజు తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి కాళ్లు కడిగి పసుపు రాయాలి. ఇలా పెళ్లి కాని అమ్మాయిలతో చేయిస్తే మంచిది. అఖండ జ్యోతి వెలిగించాలి. మొదటిరోజు అఖండ జ్యోతి వెలిగించి.. దానిని తొమ్మిది రోజులపాటు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు,శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఈ దీపానికి నెయ్యి వాడితే మంచిది. నెయ్యి అందుబాటులో లేకపోతే మరో నూనెను వాడవచ్చు. కానీ ఆవాలనూనె వాడకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి.

ఈ తొమ్మిది రోజులు ఉల్లి, వెల్లుల్లిని వాడకూడదరు. వంటల్లో ఇవి లేకుండా చూసుకుంటే చాలా బెటర్‌. నవ రాత్రుల సమయంలో షేవింగ్‌, కటింగ్‌ చేయించుకోకుండా ఉంటే మంచిది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నవరాత్రుల సమయంలో.. మాంసాహారానికి దూరంగా ఉండాలి.
నవరాత్రులు ముగిసేవరకు మద్యం, ఆల్కహాల్ సేవించకుండా ఉండాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు