GOBI: మంచూరియా లవర్స్ కి షాక్.. గోబీ బ్యాన్.. ఎందుకంటే?

గోబీ రైస్‌, గోబీ మంచూరియా తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా గోబి విక్రయాలను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. గోబిలో కృత్రిమ రంగులు, రసాయనాలు కలుపుతున్నారని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

New Update
GOBI: మంచూరియా లవర్స్ కి షాక్.. గోబీ బ్యాన్.. ఎందుకంటే?

Gobi Manchuria: ‘గోబీ, గోబీ మంచూరియన్‌’ ఈ ఫుడ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ లొట్టలేసుకొంటూ తింటారు. సాయింత్రం కాగానే ఈ చైనీస్ వంట కోసం రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ వద్ద జనం ఎగబడటం మనం చాలానే చూస్తుంటాం. గోబీ బండ్ల దగ్గరకు వాలిపోతుంటారు. అయితే, అంతటి పాపులర్ అయిన ఫుడ్ తినడం చాలా హనికరమని అంటున్నారు.

Also Read: మీ చెవులు చెప్పే మాట వినండి.. ఈ తప్పులు చేయకండి.. 

గోబీ రైస్‌, గోబీ మంచూరియా వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా గోబి విక్రయాలను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. గోబిలో కృత్రిమ రంగులు, రసాయనాలు కలుపుతున్నారని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే!.  అతి త్వరలో ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావ్‌ వీటిని నిషేదిస్తున్నట్లు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి!

అయితే, ఇప్పటికే ప్రముఖ పర్యాటక రాష్ట్రం గోవా లోని మపుసా సిటీ గోబీ మంచూరియన్‌ని బ్యాన్ చేసింది. గోబీ మంచూరియన్‌ని అపరిశుభ్రంగా తయారు చేయడమే కాకుండా.. అందులో ప్రమాదకర రంగులను వాడుతుండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. దాని తయారీకి వాడే సింథటిక్ రంగులు, పరిశుభ్రతపై ఆహార నిపుణుల ఆందోళనల కారణంగా మపుసా మున్సిపల్‌ కౌన్సిల్‌ గోబీపై నిషేదం ప్రకటించింది. నగరంలోని ఫుడ్ స్టాల్స్, విందు కార్యక్రమాల్లో గోబీ మంచూరియన్ ను బ్యాన్ చేసింది. అయితే,  ఈ వంటకం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా కొందరూ తినకుండా మానరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు