YCP: వైసీపీ పోలవరం అభ్యర్థికి షాక్.. హైకోర్టులో రేపే విచారణ!

పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మడకం వెంకటేశ్వరరావు. బీసీ కులానికి చెందిన రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతూ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ పై రేపే హైకోర్టులో విచారణ జరగనుంది.

New Update
YSRCP: పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టుకు వైసీపీ

Tellam Rajyalakshmi:  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ పోలవరం అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి కి షాక్ ఎదురైంది. రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాదంవారి గూడెంకి చెందిన మడకం వెంకటేశ్వరరావు. బీసీ కులానికి చెందిన తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతూ తప్పుడు కుల ద్రవీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కలెక్టర్ కి పిటిషనర్ రిపోర్టు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: మనుషులందరికీ షాకింగ్‌ న్యూస్‌.. బర్డ్‌ఫ్లూతో విద్యార్థి మరణం!

పిటిషనర్ కంప్లైంట్ ని పరిగణలోకి తీసుకోకుండా తెల్లెం రాజ్యలక్ష్మి ఎస్టీ అంటూ బుట్టాయిగూడెం తాసిల్దార్ ఉత్తర్వులు జారీ చేశారని అయితే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ చట్టం ప్రకారం కలెక్టర్ మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు పిటిషనర్. ఈ పిటీషన్ పై అత్యవసరంగా విచారణ చేయాలని హైకోర్టును న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోరారు. అయితే, పిటిషన్ పై న్యాయస్థానం రేపే వాదనలు వింటామని తెలిపింది. తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోలవరం నుంచి టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు