MLC Kavitha : కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మెల్యే కవితకు కోర్టు షాక్ ఇచ్చింది. వారి జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌, కవిత కస్టడీని ఈనెల 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

New Update
Delhi: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు

Shock To MLC Kavitha - CM Kejriwal : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరికి మరోసారి జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాఖలు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించింది.

అలాగే సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు ఇచ్చారు. అలాగే సిసోడియా, కవితతో పాటు ఇతర నిందితుల జ్యుడీషియల్‌ కస్టడీని కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు.

Also Read : ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.. ఎందుకంటే..



Advertisment
Advertisment
తాజా కథనాలు