AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.! తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. అయితే, నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapur: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో కొద్దికాలం క్రితం ఓ భవంతిని నిర్మించారు. తన కుటుంబ సభ్యులు అంతా కూడా అందులోనే ఉంటున్నారు. ఆక్రమించి.. అయితే ఈ ఇంటి నిర్మాణంలో మున్సిపల్ పార్కు స్థలంను కొంత మేర ఆక్రమించి నిర్మాణం చేపట్టారని కొందరి ద్వారా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటి పక్కనే ఉన్న మున్సిపల్ ప్రహారి నుంచి ఇంటి వరకు కొలతలు వేసి నివేదికలు తయారు చేసారు.ఇంటి నిర్మాణంలో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురి అయ్యిందా లేదా అనే అంశాలు తెలియాల్సి ఉంది. వైసీపీ నేతల ఆగ్రహం.. అయితే, నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. Also Read: వారిపై చర్యలు తీసుకోండి.. పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం సీరియస్.! #kethireddy-peddareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి